South Central Railway: ఆగస్టు 28 వరకూ పలు రైళ్లు రద్దు... వివరాలు!

  • పశ్చిమ కేంద్ర రైల్వే పరిధిలో యార్డు పునరుద్ధరణ
  • అక్టోబర్ 23 వరకూ పనులు జరిగే అవకాశం
  • రైళ్ల రద్దును ప్రకటించిన అధికారులు

నేటి నుంచి ఆగస్టు 28 మధ్యకాలంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పశ్చిమ కేంద్ర రైల్వే పరిధిలో యార్డు పునరుద్ధరణ పనులు జరుగుతున్న దృష్ట్యా రైళ్లను రద్దు చేస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది. పట్నా-బనస్ వాడీ హమ్ సఫర్, పట్నా - పూర్ణ, సికింద్రాబాద్ - రాక్సల్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆగస్టు 28 వరకూ రద్దు చేశామని, నేటి నుంచి అక్టోబర్ 23 వరకూ కాకినాడ టౌన్ - కోటిపల్లి రైల్ బస్ డెము రైలు సేవలు నిలిపివేశామని వెల్లడించింది. వీటితో పాటు మరికొన్ని రైళ్లను కూడా రద్దు చేయనున్నామని, వాటి వివరాలను పనులు జరిగే సమయాన్ని బట్టి ప్రకటిస్తామని తెలియజేసింది.

  • Loading...

More Telugu News