Krishna District: వైఎస్సార్ ఎత్తిపోతల పథకాన్ని రైతులకు అంకితం చేస్తున్నాం: మంత్రి నాని

  • 8 గ్రామాలకు తాగు, సాగు నీరు అందుతుంది
  • 3600 ఎకరాలకు నీటి కొరత ఉండదు
  • రైతుల కోసం ఈ పథకానికి శ్రీకారం చుట్టాం

గత ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లా నందివాడ మండలం అరిపిరాల వద్ద ఎన్టీఆర్ సుజల స్రవంతి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి పనులు చేపట్టింది. దీనికి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం 'వైఎస్సార్ ఎత్తిపోతల పథకం'గా పేరు మార్చింది. ఈ ఎత్తిపోతల పథకాన్ని నేడు మంత్రి కొడాలి నాని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఎనిమిది గ్రామాలకు తాగు, సాగు నీరు అందుతుందని తెలిపారు. 3600 ఎకరాలకు నీటి కొరత ఉండదని నాని తెలిపారు. ఈ పథకాన్ని రైతులకు అంకితం చేస్తున్నట్టు తెలిపారు. రైతుల బాధను అర్థం చేసుకుని దోసపాడు కాల్వ నుంచి రావాల్సిన నీరు సరిగా రాకపోవడంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టామని నాని వెల్లడించారు.  

  • Loading...

More Telugu News