Venkaiah Naidu: పార్లమెంటులోనూ మహిళలకు రిజర్వేషన్ ఉండాలి: ఉపరాష్ట్రపతి
- దేశాన్ని ‘మదర్ ఇండియా’ అని వ్యాఖ్యానిస్తాం
- ఫాదర్ ఇండియా అని వ్యాఖ్యానించం
- మహిళలకు బాధ్యతలు అప్పగించాలి
దేశ జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు పార్లమెంటులోనూ రిజర్వేషన్ ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నేడు ఆయన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మహిళల ప్రాముఖ్యాన్ని గురించి మాట్లాడారు. మన దేశం గురించి మాట్లాడేటప్పుడు మదర్ ఇండియా అని సంబోధిస్తామే తప్ప ఫాదర్ ఇండియా అని పిలవమని, అది మహిళలకిచ్చే ప్రాధాన్యమన్నారు. మహిళలకు రిజర్వేషన్‌తో పాటు నిధులు, విధులు, బాధ్యతలు అప్పగించాలన్నారు.