Karnataka: అనుకున్నట్టుగానే... రాజీనామా చేసిన కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్!

  • విశ్వాస పరీక్షలో యడియూరప్ప సర్కార్ విజయం
  • ఆపై వెంటనే ఆర్థిక బిల్లుకు సభ ఆమోదం
  • రాజీనామా లేఖను చదివి వినిపించిన రమేశ్ కుమార్

ముందుగా ఊహించినట్టుగానే కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ సురేశ్ కుమార్, తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో యడియూరప్ప సర్కార్ విజయం సాధించగానే, సభ ఆర్థిక బిల్లుకు ఆమోదం పలికింది. ఆ వెంటనే తన రాజీనామా లేఖను ఆయన చదివారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు, స్పీకర్ గా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను సభలో పక్షపాతం లేకుండా వ్యవహరించానని, ఏ నిర్ణయం తీసుకున్నా నిబంధనలకు అనుగుణంగానే తీసుకున్నానని తెలిపారు. కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నానని, యడ్డీ ప్రభుత్వం ప్రజారంజక పాలన సాగించాలని కోరారు.

  • Loading...

More Telugu News