Sensex: నష్టాలతో వారాన్ని ప్రారంభించిన మార్కెట్లు
- వెనక్కి తరలుతున్న విదేశీ పెట్టుబడులు
- బలహీనంగా ఉన్న ఆసియా మార్కెట్లు
- 196 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. విదేశీ ఇన్వెస్ట్ మెంట్లు వెనక్కి వెళుతుండటంతో పాటు, ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉండటం మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 196 పాయింట్లు నష్టపోయి 37,686కి పడిపోయింది. నిఫ్టీ 95 పాయింట్లు పతనమై 11,189కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (3.32%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.40%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.16%), టీసీఎస్ (0.98%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.34%).
టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (-6.52%), వేదాంత లిమిటెడ్ (-5.09%), బజాజ్ ఆటో (-4.99%), మారుతి సుజుకి (-4.26%), టాటా స్టీల్ (-2.65%).