Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. ఈరోజు కూడా కుప్పకూలిన కాఫీ డే షేర్లు
- 84 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 33 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 6 శాతం పైగా లాభపడ్డ యస్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. మెటల్, ఆటో, ఫార్మా, ఐటీ సెక్టార్ల అండతో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. మరోవైపు కాఫీ డే షేర్లు ఈరోజు కూడా 20 శాతం వరకు నష్టపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 84 పాయింట్లు లాభపడి 37,481కి పెరిగింది. నిఫ్టీ 33 పాయింట్లు పుంజుకుని 11,118 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (6.04%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.32%), టాటా స్టీల్ (4.15%), హీరో మోటో కార్ప్ (4.00%), సన్ ఫార్మా (3.96%).
టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-4.55%), భారతీ ఎయిర్ టెల్ (-2.66%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.23%), మారుతి సుజుకి (-0.64%), టెక్ మహీంద్రా (-0.59%).