Asaduddin Owaisi: ముస్లిం మహిళల మంచి కోసం బీజేపీ చట్టం తీసుకొస్తామనుకుంటోంది కానీ..: ఒవైసీ

  • ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం
  • భార్యకు అన్యాయం చేసినట్టవుతుంది 
  • ఏఐఎంపీఎల్‌బీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని ఆశిస్తున్నా

ట్రిపుల్ తలాక్ బిల్లుపై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని తాను భావిస్తున్నానని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. తలాక్ బిల్లు రాజ్యంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. నేడు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్లు ప్రకారం ఎవరైనా ముస్లిం భర్త తలాక్ చెప్తే అతడిని దోషిగా నిలబెట్టడమేనన్నారు. ముస్లిం మహిళల మంచి కోసం చట్టం తీసుకొస్తున్నామని బీజేపీ భావిస్తోందని, కానీ తలాక్ చెప్పిన భర్తకు శిక్ష పడితే ముస్లిం భార్యకు అన్యాయం చేసినట్టవుతుందన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని దీనిపై ఏఐఎంపీఎల్‌బీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని తాను భావిస్తున్నట్టు ఒవైసీ తెలిపారు.

  • Loading...

More Telugu News