India: ప్రపంచబ్యాంకు జీడీపీ నివేదికలో ఓ స్థానం దిగజారిన భారత్
- ఏడో స్థానంలో భారత్
- 2017లో భారత్ కు 6వ ర్యాంకు
- అగ్రస్థానం నిలుపుకున్న అమెరికా
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రపంచ ర్యాంకింగ్స్ లో భారత్ ఏడో స్థానానికి పడిపోయింది. 2018 సంవత్సరానికి గాను ప్రపంచబ్యాంకు ఈ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. అత్యంత భారీ ఆర్థిక వ్యవస్థల జాబితాలో 2017లో 6వ ర్యాంకులో ఉన్న భారత్ తాజా ర్యాంకింగ్స్ లో ఓ స్థానం దిగజారి ఏడోస్థానానికి పరిమితమైంది. ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా నంబర్ వన్ స్థానాన్ని నిలుపుకోగా, చైనా, జపాన్ వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ వరుసగా ఆ తర్వాతి స్థానాలలో వున్నాయి. కాగా, టాప్ లో ఉన్న అమెరికా జీడీపీ 20.5 ట్రిలియన్లు కాగా, ఏడో స్థానంలో ఉన్న భారత్ జీడీపీ విలువ 2.7 ట్రిలియన్లుగా ప్రపంచబ్యాంకు పేర్కొంది.