Israel: ఇజ్రాయెల్ లో ఉప్పు నీటిని శుద్ధి చేసే ప్లాంట్ ను సందర్శించిన సీఎం జగన్
- ఇజ్రాయెల్ లోని హడేరాలో హెచ్2ఐడీ ప్లాంట్
- ఉప్పునీటిని తాగునీటిగా మార్చే ప్రక్రియపై ప్రదర్శన
- శుద్ధి చేసిన ఉప్పునీటిని రుచి చూసిన జగన్
ఏపీ సీఎం జగన్ కుటుంసభ్యులు ఇజ్రాయెల్ దేశంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ లోని హడేరాలో ఉన్న ఉప్పు నీటిని శుద్ధి చేసి హెచ్2ఐడీ ప్లాంట్ ను జగన్ సందర్శించారు. హడేరా ప్లాంట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ రఫీ షమీర్ సమక్షంలో ఈ ప్లాంట్ ను జగన్ సందర్శించారు. జగన్ తో పాటు టెల్ అవీవ్ లోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇండియన్ మిషన్ షెరింగ్ ఉన్నారు. ఉప్పునీటిని తాగునీటిగా మార్చే ప్రక్రియకు సంబంధించిన మెకానిజం పై ఓ ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఇతర వివరాలను జగన్ కు వివరించారు. శుద్ధి చేసిన ఉప్పునీటిని జగన్ సహా అధికారులు రుచి చూసి, దాని నాణ్యతను తెలుసుకుని ప్రశంసించారు. కాగా, ఇజ్రాయెల్ పర్యటన ముగించుకుని జగన్ కుటుంబసభ్యులు ఈ రోజు రాత్రికి తిరిగి బయలుదేరనున్నారు.