Jammu And Kashmir: ఏం జరగబోతోందో మాకు తెలియడం లేదు.. ప్రజలంతా ప్రశాంతంగా ఉండండి!: ఒమర్ అబ్దుల్లా
- దేవుడు ఏది చేసినా మన మంచికే
- ప్రజలంతా జాగ్రత్తగా, ప్రశాంతంగా ఉండండి
- ట్విట్టర్ లో స్పందించిన ఎన్సీ ఉపాధ్యక్షుడు
జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. దీనికి తోడుగా రాష్ట్రాన్ని, లడఖ్, జమ్మూకశ్మీర్ అంటూ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీసింది. ఈ మేరకు రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ‘నేను కశ్మీర్ ప్రజలకు ఒకటే చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు ఏం జరగబోతోందో మాకు తెలియదు. కానీ ఆ అల్లాహ్ ఏది చేసినా మన మంచి కోసమే చేశాడని నేను నమ్ముతాను.
దీని ఫలితం ఇప్పుడు కాకున్నా కొద్దిరోజుల తర్వాత కనిపిస్తుంది. ఇప్పుడు ప్రతీఒక్కరూ జాగ్రత్తగా, సురక్షితంగా ఉండండి. ఎవ్వరూ ఆందోళన చెందవద్దు. ప్రశాంతంగా ఉండండి’ అని ట్వీట్ చేశారు.