Sensex: ఆర్టికల్ 370 ఎఫెక్ట్.. కుప్పకూలిన మార్కెట్లు
- 418 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 134 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 8 శాతం పైగా నష్టపోయిన యస్ బ్యాంక్
ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. బిల్లును సభలో ప్రవేశపెట్టిన వెంటనే మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా డాలరుతో పోల్చితే రూపాయి విలువ బలహీనపడటం... అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ భయాలు కూడా మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. ఈనాటి ట్రేడింగ్ మొత్తం తీవ్ర ఒడిదుడుకుల మధ్యే కొనసాగింది. చివరకు మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేండింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 418 పాయింట్లు పతనమై 36,699కి పడిపోయింది. నిఫ్టీ 134 పాయింట్లు కోల్పోయి 10,862కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతీ ఎయిర్ టెల్ (3.96%), టెక్ మహీంద్రా (2.15%), టీసీఎస్ (1.93%), బజాజ్ ఆటో (1.50%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.37%).
టాప్ లూజర్:
యస్ బ్యాంక్ (-8.15%), టాటా మోటార్స్ (-5.25%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-4.54%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-3.48%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-3.13%).