Bay Of Bengal: వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం... తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
- మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం
- తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు
- అక్కడక్కడ భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారగా, ఇప్పుడది వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం వాయుగుండం ఉత్తర బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఈ వాయుగుండం రాబోయే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని అధికారులు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలపై దీని ప్రభావం మూడు రోజుల పాటు ఉంటుందని, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడతాయని వివరించారు.