Kesineni Nani: ప్రజల గొంతు నొక్కారన్న కేశినేని... అన్నీ మూసుకుని కూర్చోవాలన్న పీవీపీ!
- పార్లమెంట్లో జమ్మూ కశ్మీర్ బిల్లులకు ఆమోదం
- ప్రజల గొంతు నొక్కారన్న కేశినేని నాని
- ఇది జాతి అభిప్రాయమంటూ పీవీపీ కౌంటర్
జమ్మూ కశ్మీర్ ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ, పార్లమెంట్ ఆమోదించిన బిల్లుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పీవీపీ వరప్రసాద్ ఖండించారు. ఇప్పటికే వీరిద్దరి మధ్యా ట్విట్టర్ వేదికగా పెద్ద యుద్ధమే జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇది మరో మెట్టు ఎక్కింది.
పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందిన తరువాత నాని, తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, "కాశ్మీర్ విషయంలో జరిగిన తీరు ఆమోదయోగ్యం కాదు. ఆ రోజు ఆంధ్ర ప్రజల గొంతు నొక్కారు. ఈ రోజు కాశ్మీర్ ప్రజల గొంతు నొక్కారు. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ,గులాంనబీ ఆజాద్ ,ఒమర్ అబ్దుల్లా వంటి కాశ్మీరీ నాయకుల కైనా వారి వాదన వినిపించే అవకాశం ఇచ్చి, తరువాత చేయవలసింది చేస్తే ఆక్షేపణ వుండేది కాదు" అని అన్నారు.
దీనిపై ఘాటుగా స్పందించిన పీవీపీ "చిట్టచివరకు జాతి అభిప్రాయం పార్లమెంట్ లో ప్రతిబింబించింది. నీకు ఆమోదయోగ్యం కాకపోతే అన్ని మూసుకో. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకో. ఆ రాష్ట్రానికి నిరాశా నాయకులు ఏం చేశారు...72 ఏళ్ల రక్తపాతం! దయచేసి రాహుల్ పండితా రచించిన 'అవర్ మూన్ హాజ్ బ్లడ్ క్లాట్స్' చదువు. నీ కళ్లు తెరచుకుంటాయి" అని అన్నారు.