Andhra Pradesh: ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు.. 26న నిర్వహిస్తామన్న ఈసీ!
- ఎమ్మెల్సీ పదవికి ఇద్దరు వైసీపీ, ఓ టీడీపీ నేత రాజీనామా
- ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో నిర్ణయం
- నేడు నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 26న ఉపఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇప్పటివరకూ ఎమ్మెల్సీలుగా ఉన్న కరణం బలరాం(టీడీపీ), ఎ.కలికృష్ణ శ్రీనివాస్(ఆళ్లనాని-వైసీపీ), కె.వీరభద్ర స్వామి(వైసీపీ)లు తమ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయని వెల్లడించింది. ఈ ముగ్గురు నేతలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారని పేర్కొంది. ఈ మేరకు ఈసీ ఓ ప్రకటనను విడుదల చేసింది.
ఉప ఎన్నికల ప్రక్రియ వివరాలు..
నోటిఫికేషన్: ఆగస్టు 7
నామినేషన్లకు చివరి తేదీ: ఆగస్టు 14
నామినేషన్ల పరిశీలన: ఆగస్టు 16
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: ఆగస్టు 19
పోలింగ్: ఆగస్టు 26న ఉదయం 9 గంటల నుంచి సా.4గంటల వరకు