Uttej: ఆర్ధిక పరిస్థితి కారణంగానే నేను ధైర్యం చేయలేకపోయాను: నటుడు ఉత్తేజ్
- అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండేవాడిని
- 1200తోనే నెల గడిచేది
- పూర్తిగా నటన వైపుకే వచ్చి వుంటే బాగుండేది
తెలుగు తెరకి 'శివ' సినిమాతో నటుడిగా ఉత్తేజ్ పరిచయమయ్యాడు. దర్శకత్వ శాఖలోనూ .. రచనలోను ఉత్తేజ్ కి మంచి అనుభవం వుంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'శివ' సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవాడిని. మొదట్లో నెలకి 800 రూపాయలు ఇచ్చేవారు. నాకు పెళ్లి అయిందని చెప్పేసి వర్మతో కృష్ణవంశీ మాట్లాడి నెల జీతం 1200కి పెంచేలా చేశాడు.
అందులో సగం డబ్బు రెంట్ కి పోతే, మిగతా సగంలో బతికేవాళ్లం. అసిస్టెంట్ డైరెక్టర్ గా వుంటే నెలకి ఎంతోకొంత వస్తుంది గదా అని దానిపైనే దృష్టి పెట్టాను. అందువల్లనే పూర్తిస్థాయి నటుడిగా బయటికి రావడానికి నేను ధైర్యం చేయలేకపోయాను. ఏదైతే అది అవుతుందిలే అని నేను ధైర్యం చేసి నటన వైపుకే వచ్చి వుంటే, ఈ రోజున జీవితంలో బాగా సెటిలై వుండేవాడినేమో" అని చెప్పుకొచ్చాడు.