Sensex: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 637 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 177 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 6 శాతం పైగా లాభపడ్డ హెచ్సీఎల్ టెక్నాలజీస్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. అధిక పన్నుల కేటగిరీ నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు మినహాయింపును ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోబోతోందనే అంచనాలు మార్కెట్లలో జోష్ ను నింపాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 637 పాయింట్లు ఎగబాకి 37,327కి చేరింది. నిఫ్టీ 177 పాయింట్లు లాభపడి 11,032కి పెరిగింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (6.43%), టాటా మోటార్స్ (5.58%), మహీంద్రా అండ్ మహీంద్రా (4.06%), బజాజ్ ఆటో (3.99%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (3.87%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-3.77%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.81%), యాక్సిస్ బ్యాంక్ (-0.01%).