kerala: కేరళలో వరద బీభత్సం.. విరిగిపడిన కొండ చరియల కింద 40 మంది!
- కేరళలో ఆగకుండా కురుస్తున్న వర్షాలు
- కొండచరియల కింద చిక్కుకుపోయిన భక్తులు
- బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు
కేరళలోని వయనాడ్ సరిహద్దులో ఉన్న మెప్పాడి పుథుమాల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 40 మంది చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొండచరియలు విరిగి పడడంతో పాడి ఎస్టేట్ సమీపంలోని మసీదు, ఆలయం ఇసుక, నీటితో పూర్తిగా నిండిపోయాయి. ఆ సమయంలో ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు ఉండడంతో వారంతా కొండచరియల కింద చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. గురువారం సాయంత్రం నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. బాధితుల్లో చిన్నారులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు సమాచారం. కాగా, గత కొన్ని రోజులుగా అలుపెరగకుండా కురుస్తున్న వర్షాలకు కేరళ, ముఖ్యంగా వయనాడ్ అతలాకుతలం అవుతోంది.