Cows: గోశాల ఆవుల మృతిపై పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు!

  • విషప్రభావంతోనే ఆవుల మృతి!
  • అంతర్గత అవయవాల్లో రక్తస్రావం
  • ఆవుల మృతికి పొట్ట ఉబ్బరం కారణం కాదని తేల్చిన వైద్యులు

విజయవాడ సమీపంలోని గోశాలలో ఒక్కసారే 100 ఆవులు మరణించడం జంతుప్రేమికులను నిశ్చేష్టులను చేసింది. ఆవుల మృతికి కారణాలు తెలుసుకునేందుకు పోస్టుమార్టం నిర్వహించారు. ఆవుల మరణానికి విషపదార్థాలే కారణమని వైద్యులు నిర్ధారించారు. ఆవుల కడుపులో గడ్డి మినహా మరే ఆహార పదార్థం లేదని తేల్చారు. విష ప్రభావంతో అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరిగినట్టు గుర్తించారు.

గుండె, ఊపిరితిత్తుల్లో అక్కడక్కడా రక్తపు చారికలతో పాటు, ఊపిరితిత్తుల్లో భారీగా నీరు చేరినట్టు తెలుసుకున్నారు. విష తీవ్రత కారణంగానే ఆవుల ముక్కుల్లోంచి రక్తం వచ్చినట్టు పోస్టుమార్టంలో వెల్లడైంది. ఆవుల మృతికి పొట్ట ఉబ్బరం కారణం కాదని వైద్యులు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News