cyber security: సాంకేతికతతో నేరాల నియంత్రణకు కృషి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- సైబర్ సెక్యూరిటీ అంశంపై జాతీయ సదస్సు
- హాజరైన కిషన్ రెడ్డి, సైబర్ నిపుణులు
- సవాళ్లను అధిగమించేందుకు మరింత అధ్యయనం అవసరమన్న కేంద్ర మంత్రి
దేశంలో నేరాల నియంత్రణకు స్మార్ట్‌కార్డులు ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. సైబర్ సెక్యూరిటీ అంశంపై శనివారం ఖైరతాబాద్‌లో నిర్వహించిన జాతీయ సదస్సుకు కిషన్ రెడ్డి, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ సహా పలువురు సైబర్ నిపుణులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సైబర్ టెక్నాలజీలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు మరింత అధ్యయనం అవసరమన్నారు. సైబర్ నేరగాళ్ల అప్పగింతకు ఇతర దేశాలతో ఒప్పందం చేసుకుంటున్నట్టు తెలిపారు. అన్ని రాష్ట్రాలతోనూ ఈ విషయంలో సమన్వయం చేసుకుంటున్నట్టు చెప్పారు. దేశంలో నేరాలను అరికట్టేందుకు స్మార్ట్‌కార్డులు తెచ్చే యోచనలో ఉన్నట్టు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.