Venkaiah Naidu: ఉప రాష్ట్రపతి అర్హతలు ఎలా ఉండాలో మోదీ, షాలకు నేనే చెప్పాను... వారు నన్నే ఎంపిక చేశారు: వెంకయ్యనాయుడు

  • ఉప రాష్ట్రపతిగా తన అనుభవాలతో పుస్తకం రాసిన వెంకయ్యనాయుడు
  • చెన్నైలో పుస్తకావిష్కరణ కార్యక్రమం
  • లిజనింగ్... లెర్నింగ్... లీడింగ్ పుస్తకాన్ని ఆవిష్కరించిన అమిత్ షా

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రచించిన లిజనింగ్... లెర్నింగ్... లీడింగ్ పుస్తకాన్ని చెన్నైలో ఆవిష్కరించారు. ఉప రాష్ట్రపతిగా తన రెండేళ్ల ప్రస్థానాన్ని వెంకయ్యనాయుడు పుస్తక రూపంలో తీసుకువచ్చారు. చెన్నైలోని కలైవనర్ ఆరంగంలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర  మంతి ప్రకాశ్ జవదేకర్, తమిళనాడు సీఎం పళనిస్వామి, సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఉప రాష్ట్రపతి పదవిని తాను ఎప్పుడూ కోరుకోలేదని, అనూహ్యంగా తనను వరించిందని వెల్లడించారు.


ఉప రాష్ట్రపతి అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలేంటో మోదీ, అమిత్ షాలకు వివరించానని, ఉప రాష్ట్రపతి పదవి దక్షిణాది వ్యక్తికి ఇద్దామని చెప్పానని, రైతు కుటుంబం నుంచి వచ్చిన నిరాడంబరమైన వ్యక్తి అయితే బాగుంటుందని సూచించానని తెలిపారు. అయితే, ఊహించని విధంగా మోదీ, అమిత్ షా తననే ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేశారని వెంకయ్యనాయుడు గుర్తుచేసుకున్నారు. పార్టీలో కూడా తన అభ్యర్థిత్వం పట్ల ఎవరూ వ్యతిరేకత వ్యక్తం చేయలేదని వివరించారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు పార్టీ అనేక పదవులు కట్టబెట్టి ప్రోత్సాహం అందించిందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News