India: సంఝౌతా లింక్ ఎక్స్ ప్రెస్ రద్దు చేసిన భారత్ రైల్వే
- ‘సంఝౌతా’ను ఇటీవల రద్దు చేసిన పాకిస్థాన్
- ఈ నేపథ్యంలో భారత రైల్వే నిర్ణయం
- ఢిల్లీ- అటారీ మధ్య నడిచే సంఝౌతా లింక్ ఎక్స్ ప్రెస్ రద్దు చేశాం: ఉత్తర రైల్వే
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలును నిలిపివేస్తున్నట్టు పాక్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత రైల్వే ఓ ప్రకటన చేసింది. ఢిల్లీ- అటారీ మధ్య నడిచే సంఝౌతా లింక్ ఎక్స్ ప్రెస్ రైలును రద్దు చేస్తున్నట్టు ఉత్తర రైల్వే అధికారులు ప్రకటించారు.
లాహోర్-అటారీ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ (14607/14608)ను పాకిస్థాన్ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఢిల్లీ అటారీ మధ్య ఆదివారాల్లో నడిచే లింక్ ఎక్స్ ప్రెస్ (నెంబర్ 14001/14002)ను రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, ఈ లింక్ ఎక్స్ ప్రెస్ ద్వారా ప్రయాణికులు అటారీ చేరుకుని, అక్కడి నుంచి లాహోర్ కు వెళ్లే ‘సంఝౌతా’ను మొన్నటి వరకే ఎక్కేవారు. అదేవిధంగా, లాహోర్ నుంచి అటారి చేరుకునే ప్రయాణికులు.. అక్కడి నుంచి ఇదే లింక్ ఎక్స్ ప్రెస్ ద్వారా తమ గమ్యస్థానాలు చేరుకునేవారు.