Jammu And Kashmir: జమ్మూ కశ్మీర్, లడఖ్ ల అభివృద్ధికి ఏం చేయనున్నదీ వెల్లడించిన ముఖేశ్ అంబానీ

  • జమ్మూ కశ్మీర్, లడఖ్ అభివృద్ధిలో భాగస్వాములవుతాం
  • రిలయన్స్ తరపున టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తాం
  • ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తాం

రానున్న రోజుల్లో కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కశ్మీర్, లడఖ్ లకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ తరపున కీలక ప్రకటనలు చేస్తామని ఆ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ తెలిపారు. ఈరోజు ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రజలకు అండగా నిలవాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. అ రెండు ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వాములవుతామని తెలిపారు. దీని కోసం రిలయన్స్ తరపున ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని... ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తామని చెప్పారు.

ఈనెల 8వ తేదీన జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ, జమ్మూ కశ్మీర్, లడఖ్ లలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. అక్కడ పరిశ్రమలు వస్తే, స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అన్నారు.

  • Loading...

More Telugu News