Parliament: విద్యుత్ కాంతులతో దేదీప్యమానం... పార్లమెంట్ భవంతికి శాశ్వత లైటింగ్... వీడియో!
- ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
- 875 ఎల్ఈడీ బల్బుల అమరిక
- వెలిగిపోతున్న భవంతి
భారత రాజధాని న్యూఢిల్లీ నడిబొడ్డున, దేశ సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలిచే పార్లమెంట్ భవనం, ఇక నిత్యమూ దేదీప్యమానంగా విద్యుత్ కాంతుల మధ్య ధగధగలాడనుంది. ఇంతవరకూ ఏదైనా విశేషమున్నప్పుడే, పార్లమెంట్ భవంతికి లైటింగ్ అమరుస్తుండగా, ఇప్పుడు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసిన లైటింగ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ రంగుల్లో వెలుగులను పంచే మొత్తం 875 ఎల్ఈడీ బల్బులను వినియోగించారు. ఈ లైట్లు అందాన్నిస్తూనే విద్యుత్ ను ఆదా చేస్తాయని, పర్యావరణ స్నేహపూర్వకమని అధికారులు వెల్లడించారు. ఈ లైట్ల కాంతుల మధ్య పార్లమెంట్ భవంతి ఎలా వెలిగిపోతోందో వీడియో చూడండి.