cm: సీఎం జగన్ బంధువు ఇచ్చిన తప్పుడు నివేదిక ఆధారంగానే టెండర్లు రద్దు చేశారు: దేవినేని ఆరోపణలు
- ఈ నివేదికను పోలవరం అథారిటీ తప్పుబట్టింది
- మేధావుల నిర్ణయాలను పక్కదారి పట్టిస్తున్నారు
- టెండర్లు రద్దు చేయడం ఆషామాషీ కాదని అధికారులు చెప్పారు
సీఎం వైఎస్ జగన్ పై మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘పోలవరం’పై సీఎం జగన్ బంధువు పీటర్ తప్పుడు నివేదిక ఇచ్చారని, ఈ నివేదిక ఆధారంగానే టెండర్లను రద్దు చేశారని ఆరోపించారు. మేధావుల నిర్ణయాలను పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ నివేదికను పోలవరం అథారిటీ అధికారులు తప్పుబట్టారని, టెండర్లు రద్దు చేయడం ఆషామాషీ కాదని పోలవరం అథారిటీ చెప్పిందని అన్నారు. చంద్రబాబు నివాసానికి వరద వచ్చి చేరిందని సంబరపడుతున్న వైసీపీ నేతలు, ఆ ప్రాంతంలో చాలా మంది పేదలు ఉన్నారన్న విషయాన్ని మరిచారని విమర్శించారు.