Devineni Uma: చంద్రబాబు ఇంటిని ముంచాలని చూశారు తప్ప మంత్రులు ఇంకేం చేశారు?: దేవినేని ఉమ
- ఏపీ మంత్రులపై దేవినేని ఉమ ధ్వజం
- మూర్ఖంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపాటు
- వరదల విషయంలో ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శ
రాష్ట్రంలో కరవు ఉంటే రాజధాని అమరావతిని వరదల్లో ముంచెత్తాలని చూశారని వైసీపీ నేతలపై టీడీపీ అగ్రనేత దేవినేని ఉమ ఆరోపించారు. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే రీతిలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. వరదల విషయంలో ప్రభుత్వ పనితీరును కళ్లారా చూస్తున్నామని, చంద్రబాబు ఇంటిని ముంచాలని చూడడం తప్ప మంత్రులు ఇంకేం చేశారంటూ ఉమ నిలదీశారు.
ముఖ్యమంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి తమ సొంత జిల్లాలకు నీరు తీసుకెళ్లే అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారని, వరదనీటిని తమ చేతకానితనంతో సముద్రంలోకి వదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో జలవనరుల శాఖకు మంత్రి ఆళ్ల రామకృష్ణారెడ్డా? లేక అనిల్ కుమారా? అన్నది అర్థం కావడంలేదని వ్యంగ్యం ప్రదర్శించారు. ఏపీ ప్రభుత్వ బాధ్యతారాహిత్యంపై కేంద్రానికి నివేదికలు పంపుతామని ఉమ తెలిపారు.