Telangana: దున్నపోతు తోకయినా ఆడిస్తుంది.. కానీ తెలంగాణ సర్కారు మొద్దునిద్ర పోతోంది!: రేవంత్ రెడ్డి ఆగ్రహం
- తెలంగాణలో ప్రబలిన విష జ్వరాలు
- గత 3 నెలల్లో 43 లక్షల కేసులు నమోదు
- ట్విట్టర్ లో ప్రభుత్వంపై మండిపడ్డ రేవంత్
తెలంగాణలో చాలాచోట్ల ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతున్నారు. మే నెల నుంచి ఇప్పటివరకూ తెలంగాణలో 43 లక్షలకు పైగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో పలు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు కూడా నిలిచిపోయాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ నేత, లోక్ సభ సభ్యుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
దున్నపోతుపై వాన పడితే అది కనీసం తోక అయినా ఆడిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రమంతా జ్వరాలతో అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర పోతుందా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన రేవంత్ రెడ్డి.. ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని తన ట్వీట్ కు జతచేశారు.