Raavi Kondala Rao: ఎన్టీ రామారావుగారితో అలా పరిచయం ఏర్పడింది: నటుడు రావి కొండలరావు

  • నటన పట్ల ఆసక్తి ఎక్కువ 
  • చెన్నైలో నాటకాలు వేసేవాడిని 
  • 'శోభ' సినిమాలో చిన్నవేషం వేశానన్న కొండలరావు

రావి కొండలరావు మంచి నటుడు .. రచయిత. అలనాటి రచయితలతోను .. దర్శకులతోను .. అగ్రస్థాయి నటీనటులతోను కలిసి పనిచేసిన అనుభవం ఆయన సొంతం. అలాంటి రావి కొండలరావు తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, ఎన్టీ రామారావుగారితో తనకి పరిచయం ఏర్పడిన సందర్భాన్ని గురించి ప్రస్తావించారు.

"మాది శ్రీకాకుళం .. మొదటి నుంచి నటనపట్ల ఆసక్తి ఉండేది. చెన్నైలో 'ఆనందవాణి' అనే పత్రికలో పనిచేస్తూనే, నాటకాలు వేసేవాడిని. బాపూ .. రమణ గారు నన్ను నటన దిశగా ప్రోత్సహించారు. కమలాకర కామేశ్వరరావుగారి దగ్గర దర్శకత్వ శాఖలో కొంతకాలం పనిచేశాను. ఆయన దర్శకత్వం వహించిన 'శోభ' చిత్రంలో ఎన్టీఆర్ .. అంజలీదేవి నటించారు. ఆ సినిమాలో నేను డాక్టర్ వేషం వేశాను. ఆ సమయంలోనే నన్ను రామారావుగారికి కామేశ్వరరావుగారు పరిచయం చేశారు" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News