Chidambaram: కుంభకోణంలో వచ్చిన సొమ్ముతో స్పెయిన్, యూకేలలో కాటేజీలు కొన్నారు: ఈడీ
- ఐఎన్ఎక్స్, ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కుంభకోణాల్లో చిదంబరం, కార్తీ
- విచారిస్తున్న సీబీఐ, ఈడీ
- ఇప్పటికే పలు ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ఈడీ యత్నిస్తోంది. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణంలో వచ్చిన సొమ్ముతో చిదంబరం కుమారుడు కార్తీ స్పెయిన్ లో ఓ టెన్నిస్ క్లబ్బును, యూకేలో కాటేజీలను, భారత్ తో పాటు ఇతర దేశాల్లో పలు ఆస్తులను కొన్నారని ఈడీ ఆరోపిస్తోంది. వీటి విలువ రూ. 54 కోట్లకు పైగా ఉంటుందని చెబుతోంది.
ఈ కేసులో కార్తీతో పాటు చిదంబరం కూడా నిందితుడిగా ఉన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్ సెల్-మ్యాక్సిస్ 2జీ కుంభకోణాలలో తండ్రి, కుమారుడిపై ఛార్జ్ షీట్లు నమోదయ్యాయి. ఇప్పటికే కొన్ని ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.