Sensex: దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు
- ఆర్థిక సంక్షోభం ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్న కేంద్రం
- 793 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 229 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో దూసుకుపోయాయి. ఆర్థిక సంక్షోభం ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఇన్వెస్టర్లలో జోష్ నెలకొంది. దీంతో, ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు... ఆ తర్వాత రాకెట్ లా దూసుకుపోయాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా లాభపడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 793 పాయింట్లు పెరిగి 37,494కి ఎగబాకింది. నిఫ్టీ 229 పాయింట్లు లాభపడి 11,058కి చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (5.37%), యస్ బ్యాంక్ (4.98%), బజాజ్ ఫైనాన్స్ (4.93%), ఐసీఐసీఐ బ్యాంక్ (4.49%), ఎల్ అండ్ టీ (3.84%).
టాప్ లూజర్స్:
వేదాంత లిమిటెడ్ (-2.07%), సన్ ఫార్మా (-2.05%), హీరో మోటో కార్ప్ (-2.01%), టాటా స్టీల్ (-1.93%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.90%).