Talari Rangaiyah: తొలిసారి టెన్త్ ఫెయిలయ్యా... తర్వాత గ్రూప్-1 సాధించా, ఇప్పుడు ఎంపీని: వైసీపీ నేత తలారి రంగయ్య
- అనంతపురం కళాశాలలో ఫ్రెషర్స్ డే
- పాల్గొని ప్రసంగించిన తలారి రంగయ్య
- కష్టపడితే ఏదైనా సాధ్యమేనని సలహా
తొలిసారి టెన్త్ పరీక్షలు రాసినప్పుడు ఫెయిల్ అయిన తాను, ఆపై కష్టపడి చదివి గ్రూప్-1 సాధించానని, ఇప్పుడు ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతోనే రాజకీయాల్లోకి రాగా, ప్రజలు ఆశీర్వదించారని అనంతపురం పార్లమెంట్ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తలారి రంగయ్య వ్యాఖ్యానించారు.
నగరంలోని మహిళా డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే జరుగగా, విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, కృషి, పట్టుదలతో దేన్నైనా సాధించవచ్చని అన్నారు. తనకు తొలుత ఎస్ఐ ఉద్యోగం వచ్చిందని, దానితో తృప్తి చెందకుండా, గ్రూప్–1 సాధించానని అన్నారు. బాగా చదువుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సులువవుతుందని చెప్పారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి ప్రసంగిస్తూ, ఆంగ్ల భాషపై పట్టు సాధిస్తే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని విద్యార్థినులకు సలహా ఇచ్చారు.