Ajantha Mendis: అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ మెండిస్ గుడ్‌బై

  • 2015లో చివరిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం
  • టీ20ల్లో రెండుసార్లు ఆరు వికెట్లు సాధించిన ఒకే ఒక్కడు
  • నిరాశతో క్రికెట్‌కు గుడ్‌బై

దేశవాళీ క్రికెట్ ఆడుతున్నా అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం రావడం లేదన్న నిరాశతో శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ అజంత మెండిస్(34)  అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. 2015లో చివరిసారి జాతీయ జట్టుకు ఆడిన మెండిస్ అప్పటి నుంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. అయినప్పటికీ నిరాశే ఎదురవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మెండిస్ ఏడేళ్ల క్రికెట్ కెరియర్‌లో 19 టెస్టులు, 87 వన్డేలు, 39 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 70, వన్డే, టీ20ల్లో 218 వికెట్లు పడగొట్టాడు. అరంగేట్రంలోనే 8 వికెట్లు తీసి సంచలనం సృష్టించిన మెండిస్.. టీ20 క్రికెట్‌లో రెండుసార్లు ఆరు వికెట్లు పడగొట్టిన ఘనతను సొంతం చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత వికెట్ల వేటలో వెనకబడడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. దేశవాళీ క్రికెట్‌లో ఆడుతూ నాలుగేళ్లు ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో నిరాశతో అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

  • Loading...

More Telugu News