Sheep: హరితహారం మొక్కను మేసిందట... గొర్రెకు రూ. 500 జరిమానా!
- కామారెడ్డి జిల్లా పెద్ద మల్లారెడ్డిలో ఘటన
- పదే పదే మొక్కలను మేస్తున్న గొర్రె
- హెచ్చరించినా వినలేదంటున్న అధికారులు
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా మొక్కలు నాటగా, వాటిని తినేసిందన్న ఆరోపణపై ఓ గొర్రెపై రూ. 500 జరిమానా విధించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం, పెద్ద మల్లారెడ్డిలో జరిగింది. గ్రామ శివారు ప్రాంతంలో అధికారులు మొక్కలు నాటగా, కటికె లింగోజి అనే వ్యక్తి పెంచుకుంటున్న గొర్రె, వాటిని మేసింది. అప్పటికే ఓ మారు లింగోజీని హెచ్చరించిన అధికారులు, ఆయన పట్టించుకోకుండా, గొర్రెను పదేపదే బయటకు వదులుతున్నాడని ఆరోపిస్తూ, జరిమానా విధించారు.