Sensex: భారీగా నష్టపోయిన మార్కెట్లు
- అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాకులు
- 348 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 92 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాకులు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 348 పాయింట్లు నష్టపోయి 37,068కి పడిపోయింది. నిఫ్టీ 92 పాయింట్లు పతనమై 10,953కు దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (5.15%), వేదాంత లిమిటెడ్ (2.91%), ఎన్టీపీసీ (2.75%), ఓఎన్జీసీ (2.06%), ఏసియన్ పెయింట్స్ (0.99%).
టాప్ లూజర్స్:
ఎస్బీఐ (-3.47%), యస్ బ్యాంక్ (-3.28%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.85%), యాక్సిస్ బ్యాంక్ (-2.32%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-2.32%).