Pawan Kalyan: జగన్ కుటుంబసభ్యులు, సన్నిహితులు ఎవరూ చెడు ప్రకటనలు చేయడంలేదు... బొత్స బాధ్యుడు కావొద్దని విజ్ఞప్తి చేస్తున్నా: పవన్ కల్యాణ్
- రాజధాని అమరావతిని వ్యతిరేకించడం అంటే మోదీ, అమిత్ షాలను వ్యతిరేకించినట్టేనన్న పవన్
- బొత్స ఓసారి ఫోక్స్ వ్యాగన్ కేసులను జ్ఞప్తికి తెచ్చుకోవాలంటూ హితవు
- మంగళగిరిలో జనసేన సభ
ఏపీలో కొన్నిరోజులుగా రాజధాని అమరావతి చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికీ ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. తాజాగా, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళగిరి సభలో దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో జగన్ కుటుంబ సభ్యుల నుంచి కానీ, సన్నిహితుల నుంచి కానీ ఎలాంటి చెడు ప్రకటనలు రావడంలేదని అన్నారు. ఈ నేపథ్యంలో బొత్స చెడు ప్రకటనలకు బాధ్యుడు కావొద్దని విజ్ఞప్తి చేస్తున్నా అంటూ హితవు పలికారు. రాజధాని అమరావతిని వ్యతిరేకిస్తున్నారంటే మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్టేనని బొత్స గుర్తెరగాలని, ఓసారి ఫోక్స్ వ్యాగన్ కేసులను కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటే మంచిదని సూచించారు.