Narendra Modi: మళ్లీ విదేశాలకు వెళుతున్న మోదీ... ఈ నెల 4న రష్యా పయనం
- తూర్పు దేశాల ఆర్థిక సదస్సులో పాల్గొననున్న మోదీ
- రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ
- తిరిగి ఈ నెల 5న భారత్ రాక
భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీ సంవత్సరంలో చాలా రోజులు విదేశీ పర్యటనల్లో కొనసాగారంటే అతిశయోక్తి కాదు. విదేశాంగ విధానంపై అత్యంత శ్రద్ధ చూపిస్తున్న మోదీ ఈ క్రమంలో మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 4న భారత్ కు చిరకాల మిత్రదేశంగా పేరుతెచ్చుకున్న రష్యాకు వెళుతున్నారు. ఈ సందర్భంగా రష్యాలో జరిగే తూర్పు దేశాల ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు. ముఖ్యంగా, భారత్-రష్యా 20వ వార్షిక సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అవుతారు. తిరిగి ఈ నెల 5న మోదీ భారత్ చేరుకుంటారు.