Sensex: ఆరేళ్ల కనిష్ఠానికి జీడీపీ వృద్ధి రేటు... కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- 769 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 225 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 4 శాతం పైగా నష్టపోయిన ఐసీఐసీఐ బ్యాంక్
గత శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన జీడీపీ వృద్ధిరేటు డేటా ఈరోజు మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో, వారు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు పతనమవుతూనే వచ్చాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 769 పాయింట్లు నష్టపోయి 36,562కి పడిపోయింది . నిఫ్టీ 225 పాయింట్లు కోల్పోయి 10,797కు దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ లోని 30 కంపెనీలలో కేవలం రెండు మాత్రమే లాభాల్లో ముగిశాయి. టెక్ మహీంద్రా (1.24%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.62%).
టాప్ లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (-4.45%), టాటా స్టీల్ (-3.93%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.89%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-3.67%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-3.40%).