Andhra Pradesh: ఏపీలో రెండ్రోజుల పాటు బలమైన ఈదురుగాలులు... వినాయక మంటపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
- వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
- ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
- ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు
వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో రెండ్రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని, ఈ కారణంగా వినాయక మంటపాల నిర్వాహకులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఎస్డీఆర్ఎఫ్ అధికారులు హెచ్చరించారు. మంటపాల పటిష్టతకు తగినవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.