Narendra Modi: అమెరికా ఆంక్షల వల్ల ఇబ్బందేమీ లేదు: ప్రధాని మోదీ ధీమా
- భారత్ కు ప్రధాన మిత్రదేశంగా ఉన్న రష్యా
- క్రిమియాపై దండెత్తిందంటూ రష్యాపై అమెరికా ఆంక్షలు
- భారత్-రష్యా ఆర్థిక సంబంధాలకు ఎలాంటి అవరోధం ఉండబోదని మోదీ వ్యాఖ్యలు
- తూర్పు దేశాల ఆర్థిక సదస్సులో పాల్గొన్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో జరిగిన తూర్పు దేశాల ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్-రష్యా ఆర్థిక సంబంధాలకు అమెరికా ఆంక్షలు ఎలాంటి అవరోధం కాదని అభిప్రాయపడ్డారు. ఎనర్జీ, రక్షణ రంగాల్లో రష్యాతో భారత్ కొనసాగిస్తున్న వ్యూహాత్మక ఒప్పందాలపై ఆ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని తెలిపారు. అయితే, ఒక దేశంపై విధించే ఆంక్షలు ఇతర దేశాలపైనా, మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా పడుతుండడం ఆందోళన కలిగించే అంశం అని అభిప్రాయపడ్డారు. క్రిమియాపై రష్యా దండెత్తినప్పటి నుంచి రష్యాపై అమెరికా ఆంక్షలు అధికమయ్యాయి. రష్యాతో పాటు దానికి సహకరించే మిత్ర దేశాలను కూడా అమెరికా టార్గెట్ చేస్తోంది.