brahman corporation: ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా మల్లాది విష్ణు?
- సీనియర్ నేతకు కీలక పదవి కట్టబెట్టే యోచనలో జగన్
- నేడో, రేపో నియామక ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం
- వైఎస్‌కు విశ్వాసపాత్రుడిగా విష్ణుకు గుర్తింపు
దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడిగా గుర్తింపు పొంది, ప్రస్తుతం జగన్ సారధ్యంలోని వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులు కానున్నారని సమాచారం. నేడో, రేపో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి.
2009లో విజయవాడ సెంట్రల్ నుంచి గెలుపొందిన విష్ణు, ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. దీంతో మల్లాదికి జగన్ కేబినెట్లో చోటు దక్కుతుందని అంతా భావించినప్పటికీ కుల సమీకరణల కారణంగా ఆయనకు అవకాశం రాలేదు. దీంతో ఆయనకు కీలకమైన బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి కట్టబెట్టాలని జగన్ నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం.