Sofiya Mirza: కిడ్నాప్ కేసులో అరెస్టయిన పాక్ అందాల సుందరి సోఫియా మీర్జా!
- పాక్ లో వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న సోఫియా
- మనీ లాండరింగ్ లో సంబంధాల ఆరోపణలు
- దర్యాఫ్తులో తేల్చిన ఇన్వెస్టిగేషన్ ఏజన్సీలు
మనీ లాండరింగ్, కిడ్నాప్ కేసుల్లో పాకిస్థాన్ అందాల సుందరి, ప్రముఖ మోడల్ సోఫియా మీర్జాకు సంబంధాలు ఉన్నాయని పాక్ నేషనల్ అకౌంట్‌బులిటీ బ్యూరో, తన దర్యాఫ్తులో తేల్చింది. ఈమెపై గతంలోనే ఎన్నో అభియోగాలు రాగా, ఆమె నేరాలపై ప్రాధమిక సాక్ష్యాలను సేకరించిన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సహా పలు దర్యాప్తు బృందాలు విచారణను వేగవంతం చేశాయి.
పాక్ చిత్రపరిశ్రమలో సోఫియా మీర్జా అత్యంత వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకుంది. ఈమెపై కిడ్నాప్ కేసులు కూడా నమోదు కావడం గమనార్హం. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని, మాజీ భర్త చేస్తున్న తప్పుడు ప్రచారంలో భాగమని సోఫియా మీర్జా వాదిస్తున్నా, ఆమె చుట్టూ ఉచ్చు మాత్రం మరింతగా బిగుసుకుంది. గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ అనుమతి లేకుండా డాలర్లతో యూఏఈ వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమెను ఇస్లామాబాద్ లోని షహీద్ బేనజీర్ భుట్టో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారు కూడా.