Andhra Pradesh: పరిపాలన చేతకాకపోతే వదిలెయ్యాలి: జగన్ కు బుద్ధా హితవు
- ఎన్నికల వరకే పార్టీలు ఆ తర్వాత అందరూ ఒకటే
- గెలిచిన వాళ్లు పార్టీలకు అతీతంగా పని చేయాలి
- వైసీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది
పరిపాలన చేతకాకపోతే వదిలెయ్యాలని ఏపీ సీఎం జగన్ కు టీడీపీ నేత బుద్ధా వెంకన్న హితవు పలికారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల వరకే పార్టీలు అని, ఆ తర్వాత అందరూ ఒకటేనని, గెలిచిన వాళ్లు పార్టీలకు అతీతంగా పని చేయాలని అన్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులపై వైసీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి పదవులు ముఖ్యం కాదని, ప్రజాక్షేమం ముఖ్యమని అన్నారు. ప్రజల తరపున తమ గొంతుక వినిపిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. పల్నాడు ప్రజలకు రక్షణ కావాలని, వారి గుండెల్లో ధైర్యం నింపాలని అన్నారు.