Andhra Pradesh: జమ్మూకశ్మీర్ కోసం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ నేత సీఎం రమేశ్!
- ఈరోజు శ్రీవారిని దర్శించుకున్న నేత
- భారత్ 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలని ప్రార్థన
- కశ్మీర్ లో శాంతి నెలకొనాలని కోరుకున్నట్లు వెల్లడి
బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ విషయమై సీఎం రమేశ్ స్పందిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లుగా అవతరించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం నెరవేరేలా ఆశీర్వదించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.
అలాగే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ ప్రపంచస్థాయి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలని, శాంతి నెలకొనాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు వెల్లడించారు. ఆ దేవదేవుడి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం రమేశ్ ట్వీట్ చేశారు.