Ravishastri: కోట్లు కొల్లగొడుతున్న రవిశాస్త్రి!

  • టీమిండియా ప్రధాన కోచ్ గా శాస్త్రికి భారీ పారితోషికం
  • గతంలో ఏడాదికి రూ.8 కోట్లు అందుకున్న శాస్త్రి
  • తాజాగా పారితోషికం 20 శాతం పెంపు!

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐ, భారత జట్టు సిబ్బందికి తన స్థాయికి తగిన విధంగానే పారితోషికాలు ఇస్తుంది. అందుకే టీమిండియా కోచింగ్ స్టాఫ్ లో చేరేందుకు ప్రతి ఒక్కరూ ఉవ్విళ్లూరుతుంటారు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పారితోషికమే అందుకు నిదర్శనం. ఇటీవలే ముగిసిన వరల్డ్ కప్ వరకు ఏడాదికి రూ.8 కోట్ల చొప్పున ఫీజు అందుకున్న రవిశాస్త్రి ఇప్పుడు మరికాస్త ఎక్కువ పారితోషికం అందుకోబోతున్నాడు.

ఆయన పారితోషికాన్ని బీసీసీఐ 20 శాతం పెంచినట్టు తెలుస్తోంది. ఆ లెక్కన చూస్తే ఏడాదికి రవిశాస్త్రికి దాదాపు రూ.10 కోట్ల వరకు గిట్టుబాటు అవుతుంది. దీనికి అదనంగా బోనస్ లు ఎలాగూ ఉంటాయి. ఓ సిరీస్ గెల్చినా, మేజర్ టోర్నమెంట్లలో టైటిల్ గెల్చినా బీసీసీఐ భారీ నజరానాలు ఇస్తుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో సరైన సంబంధాలు కలిగి ఉండడమే శాస్త్రి మరోసారి కోచ్ గా పగ్గాలు చేపట్టడానికి కారణమైంది.

  • Loading...

More Telugu News