YSRCP: వైసీపీ వందరోజుల పాలన ‘అన్ పాపులర్’ అయిపోయింది: టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు

  • పల్నాడు ప్రాంతంలో ఎన్నో అరాచకాలు జరిగాయి
  • గురజాల, మాచర్లలో వైసీపీ దాడులకు పాల్పడింది
  • టీడీపీ మద్దతుదారులను మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారు

ఏపీలో వైసీపీ వంద రోజుల పాలనలో పల్నాడు ప్రాంతంలో ఎన్నో అరాచకాలు జరిగాయని టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ దాడులకు గురైన టీడీపీ బాధితుల శిబిరాన్ని గుంటూరులో ఈరోజు ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా యరపతినేనిని మీడియా పలకరించింది. గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో వైసీపీ దాడులకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. టీడీపీ మద్దతుదారుల ఇళ్లు కూలగొట్టారని, వందలాది కుటుంబాలు గ్రామాలు విడిచి పెట్టి వెళ్లిపోయే పరిస్థితి నెలకొందని అన్నారు.

టీడీపీ మద్దతుదారులను మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తోందని, వందరోజుల్లోనే ‘అన్ పాపులర్’ అయిపోయిందని విమర్శించారు.

  • Loading...

More Telugu News