Andhra Pradesh: ‘తుని రైలు దగ్ధం' ఘటనలో చంద్రబాబు 140 మంది వైసీపీ వాళ్లపై తప్పుడు కేసులు పెట్టించారు!: వైసీపీ నేత దాడిశెట్టి రాజా

  • బీసీలు, మైనారిటీలపై కేసు నమోదుచేశారు
  • ఎల్లో మీడియాతో బాబు బురద చల్లుతున్నాడు
  • ఇలాగే చేస్తే వచ్చే ఎన్నికల్లో 5 సీట్లు కూడా రావు

తెలుగుదేశం  అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో తునిలో కాపు గర్జన జరిగిందనీ, ఈ సందర్భంగా రైలు దగ్ధం జరిగితే 140 మంది వైసీపీ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాపులు, బీసీలు, మైనారిటీలపై కూడా చంద్రబాబు కేసులు నమోదు చేయించారని విమర్శించారు. నేరచరిత్ర కలిగిన చంద్రబాబు తన ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలోని గుంటూరులో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలతో కలిసి దాడిశెట్టి రాజా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో అసమర్థ పాలనను అందించారనీ, అందుకే ఏపీ ప్రజలు 23 సీట్లతో బుద్ధి చెప్పారని రాజా వ్యాఖ్యానించారు. టీడీపీ ఇదే రకంగా కొనసాగితే రాబోయే ఎన్నికల్లో వారికి 5 సీట్లు కూడా రావని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ఛలో ఆత్మకూరు పేరుతో పెయిడ్ ఆర్టిస్టుల సాయంతో కొత్త డ్రామాకు తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News