Bc commission: ఏపీలో శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు.. చైర్మన్ గా జస్టిస్ శంకరనారాయణ నియామకం
- బీసీలకు న్యాయం చేసేందుకు శాశ్వత ప్రాతిపదికన కమిషన్
- ఈ పదవిలో మూడేళ్లు కొనసాగనున్న శంకరనారాయణ
- ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు
ఏపీలో శాశ్వత బీసీ కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ జస్టిస్ శంకరనారాయణను నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. సామాజికంగా వెనుకబడిన బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంలో భాగంగానే శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాగా, జస్టిస్ శంకర నారాయణ ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేశారు.