Chiranjeevi: తెలుగు రాష్ట్రాల్లో 'సైరా'కి లాభాలు రావాలంటే ఈ మార్కును దాటవలసిందేనట
- భారీస్థాయిలో 'సైరా' బిజినెస్
- దిల్ రాజు చేతికి నైజామ్ ఏరియా హక్కులు
- అమెజాన్ చేతికి డిజిటల్ రైట్స్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చరణ్ నిర్మాతగా 'సైరా' నిర్మితమైంది. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మెగా అభిమానులందరూ ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వసూళ్ల పరంగా ఈ సినిమా సృష్టించనున్న రికార్డులను గురించిన చర్చలు అప్పుడే మొదలైపోయాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీస్థాయిలో బిజినెస్ జరుపుకుంది. ఈ సినిమా నైజామ్ ఏరియా హక్కులను 30 కోట్లకు దిల్ రాజు దక్కించుకున్నారు. సీడెడ్ ఏరియా హక్కులను ఎన్వీ ప్రసాద్ 22 కోట్లకు సొంతం చేసుకున్నాడు. ఇలా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 112.30 కోట్లకు అమ్ముడైంది. అందువలన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 120 కోట్లకి పైగా వసూళ్లు సాధిస్తే లాభాల బాట పట్టినట్టు అవుతుందని అంటున్నారు. అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను 40 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం.