Sensex: ఐదు రోజుల లాభాలకు బ్రేక్
- అమ్మకాల ఒత్తిడికి గురైన ఐటీ, ఆటో, ఎనర్జీ స్టాకులు
- 166 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 52 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
ఐదు రోజుల లాభాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం నుంచి లాభాల్లో కొనసాగిన మార్కెట్లు చివరి రెండు గంటల్లో నష్టాల్లోకి జారుకున్నాయి. ఆటో, ఎనర్జీ, ఐటీ స్టాకులు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 166 పాయింట్లు కోల్పోయి 37,104కు పడిపోయింది. నిఫ్టీ 52 పాయింట్లు నష్టపోయి 10,982 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (2.13%), సన్ ఫార్మా (1.34%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.26%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.95%), ఎస్బీఐ (0.54%).
టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-5.10%), టాటా మోటార్స్ (-4.76%), మారుతి సుజుకి (-3.13%), యాక్సిస్ బ్యాంక్ (-2.74%), భారతి ఎయిర్ టెల్ (-2.20%).