New Delhi Bacteria: 2011లో తొలిసారి... ఇప్పుడు గుంటూరులో కనిపించిన 'న్యూఢిల్లీ బ్యాక్టీరియా'!
- పలు సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ప్రమీల
- వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు
- ప్రమాదకరమైన బ్యాక్టీరియా సోకిందని నిర్ధారణ
దాదాపు 18 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కనిపించిన అత్యంత ప్రమాదకరమైన న్యూఢిల్లీ మెటల్లో బీటా ల్యాక్టమేజ్ (ఎన్డీఎం-1) బ్యాక్టీరియా, ఇప్పుడు మరోసారి గుంటూరులో కనిపించింది. 2011లో తెలంగాణ ప్రాంతంలో న్యూఢిల్లీ బ్యాక్టీరియాకు సంబంధించిన తొలి కేసు నమోదుకాగా, ఇప్పుడు గుంటూరుకు చెందిన పూర్ణ ప్రమీల (55) అనే మహిళకు ఈ బ్యాక్టీరియా సోకిందని వైద్య నిపుణుడు డాక్టర్ కోగంటి కల్యాణ్ చక్రవర్తి వెల్లడించారు.
జ్వరం, నీరసం, కామెర్లు, మూత్ర సమస్యలతో ఈ నెల 3వ తేదీన అరండల్ పేటలోని శ్రీ హాస్పిటల్ లో ప్రమీల చేరగా, ఆమెకు రక్త పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు, ఇది న్యూఢిల్లీ బ్యాక్టీరియాగా తేల్చారు. ఇది ప్రమాదకరమైనదని, ఆమెకు చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు.