Hyderabad: వైద్యుల నివేదిక తర్వాత కోడెల మృతిపై ప్రకటన చేస్తాం: డీసీపీ శ్రీనివాస్

  • కోడెల మృతిపై ప్రాథమికంగా ఎలాంటి అనుమానాల్లేవు
  • కుటుంబ సభ్యుల ప్రకారం కోడెలది బలవన్మరణం
  • 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశాం

వైద్యుల నివేదిక తర్వాత కోడెల శివప్రసాదరావు మృతిపై ప్రకటన చేస్తామని పశ్చిమ మండలం డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. కోడెల పదకొండు గంటల సమయంలో తన పడకగదిలో పడిపోయి ఉన్నారని, ఆయన భార్య, కుమార్తె, పనిమనిషి కలిసి ఆయన్ని ఆసుపత్రికి తీసుకొచ్చారని చెప్పారు. అప్పటికే, కోడెల చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారని అన్నారు.

కుటుంబసభ్యులు చెప్పిన ప్రకారం కోడెల బలవన్మరణానికి పాల్పడ్డారని, అయితే, పోస్ట్ మార్టమ్ తర్వాతే ఆయన మృతికి గల అసలు కారణాలు తెలుస్తాయని అన్నారు. కోడెల మృతిపై ప్రాథమికంగా తమకు ఎలాంటి అనుమానాలు లేవని, నిన్న రాత్రి కోడెల ఇంట్లో ఎలాంటి గొడవ జరగలేదని చెప్పారు. 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. కాగా, పోస్ట్ మార్టమ్ నిమిత్తం కోడెల భౌతికకాయాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు.

  • Loading...

More Telugu News